ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో పార్ట్‌టైం ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. లా విభాగంలోని కోర్సులను బోధించేందుకు అర్హులైన వారు దరఖాస్తుచేసుకోవచ్చన్నారు.
ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ రిజ్యూమెతో సహా ధృవపత్రాల నకలు కాపీలను ఈనెల 27 లోగా తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. లా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో పీజీ పాసై ఉండాలని సూచించారు.
సంబంధిత విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసి ఉండడం, నెట్, స్లెట్, సెట్ పరీక్షల్లో అర్హత సాధించి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు.