Class rooms | విద్యార్థుల కోసం నాలుగు ప్రత్యేక గదులు నిర్మిస్తా : ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

మైలార్‌దేవ్‌పల్లి : పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి రామ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు.
పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి పోవడంతో తరగతి గదులు సరిపోవడం లేదని ఉపాద్యాయులు ఎమ్మెల్యే వివరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..తరగతి గదుల కోసం ఎమ్మెల్యే నిధులను నుండి నాలుగు అదనపు గదులు నిర్మాణం చేపడుతానని హమీ ఇచ్చారు.
మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో నల్లా కనెక్షన్ ఇవ్వాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారిచేశారు. మధ్యాహ్న భోజనంలో మంచి ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులను సూచించారు.
ఉపాధ్యాయుల బోధనలు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్ ,యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్,నాని,పాటశాల ఉపాద్యాయులు మాణిక్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

