Roads development | సనత్‌నగర్‌లో రహదారుల అభివృద్ధికి కృషి : మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్

బేగంపేట్ : సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు.
శుక్రవారం రాంగోపాల్‌పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే వెంగళ్రావు నగర్లో 2.5 లక్షల వ్యయంతో నూతనంగ చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి తలసాని బేగంపేట్, రాంగోపాల్‌పేట్ డివిజన్ల కార్పొరేటర్లు మహేశ్వరి, చీర సుచిత్రలతో కలిసి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల రహదారులను ప్రత్యేక కార్యచరణతో నిర్మాణ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వివరించారు. రహదారులూలే కాకుండ మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం వంటి పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రజలు సమస్యలను దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా ఏవైన సమస్యలుంటే సంబంధిత అధికారులకు గానీ,తనకు కానీ తెలియజేయాలని కోరారు. అనంతరం స్థానికంగ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
చిన్నారులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి,మాజీ కార్పొరేటర్ తరుణి, అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

