బాసర, ఏప్రిల్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. బాసరలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శనివారం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభు త్వం బడగు బలహీ వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చేర్పించలేని తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయంతో మేలు చేకూరుతుందని చెప్పారు.
ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటారని అన్నారు. ఇందుకు గాను ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనను కొనసాగిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ నర్సింగరావు, సర్పంచ్ లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్యాం, నాయకులు రమేశ్, జ్ఞాని పటేల్, ఉపాధ్యాయులు, అధికారులున్నారు.
కుంటాల, ఏప్రిల్ 9 : మున్నూరుకాపుల సంక్షేమానికి దశలవారీగా కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన మున్నూరుకాపు సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కుంటాల మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట పట్లె రఘు, నాయకులు జుట్టు లక్ష్మణ్, సట్ల వినోద్, జక్కుల రమేశ్, సీపతి వివేకానంద, మహాగాం నాగరాజు, కుమ్మరి గజేందర్, ఒడ్నం అనిల్ కుమార్, రాములు, గంగాధర్, సబ్బిడి గజేందర్ ఉన్నారు.
ముథోల్, ఏప్రిల్ 9 : ముథోల్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందిన మోహన్ యాదవ్‌కు రూ. 23,500, పిరాసత్ అహ్మద్‌కు రూ. 24 వేలు, పోసానికి రూ. 20 వేలు అందజేశారు. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, బాబన్న ఉన్నారు.