e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జిల్లాలు సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి
అధికారులు, వైద్యులతో సమావేశం

హాజీపూర్‌, జూన్‌ 17 : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో వర్షాపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి తొలగించాలన్నారు. తాగునీటి బావుల్లో క్లోరినేషన్‌ చేయాలన్నారు. ప్రతి పంచాయతీలో వ్యాధుల వ్యాప్తి ని వారణ చర్యల పోస్టర్లను ప్రదర్శించాలని సూచించారు. జిల్లాకు 31 వేల 600 దోమ తెరలు వచ్చాయని, అవసరమున్న వారికి అందించాలన్నారు. మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంటుందని, రోడ్ల కూడళ్లు, జన సం చారం ఉన్న ప్రాంతాల్లో గోడ ప్రతుల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పా టించేలా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుబ్బారాయుడు, డీపీవో నారాయణ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఉమాదేవి, జిల్లా నీటి పారుదల శా ఖ అధికారి అంజన్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ శేషా ద్రి, మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి, మలేరి యా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అనిత, జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సఖీ కేంద్రాల్లో సత్వర న్యాయం
జిల్లాలోని సఖీ కేంద్రాలకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామ ని కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కే ఈశ్వరీబాయి జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లాలోని సఖీ సెంటర్‌ను ఆమె పరిశీలించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి
సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి
సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

ట్రెండింగ్‌

Advertisement