e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు సహాయ కేంద్రాల ద్వారా సత్వర న్యాయం

సహాయ కేంద్రాల ద్వారా సత్వర న్యాయం

సహాయ కేంద్రాల ద్వారా సత్వర న్యాయం

ఖమ్మం లీగల్‌, జూన్‌ 16: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సత్తుపల్లిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌కే భూపతి ఖమ్మం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయసేవలు అందించేందుకు న్యాయసేవా సంస్థలకు లభించిన మరో ఉపకరణం న్యాయ సహాయ కేంద్రమని అభివర్ణించారు. ఈ కేంద్రం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు, గిరిజనులకు న్యాయ సహాయం సత్వరంగా అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువురాని వారికి ఈ కేంద్రం ద్వారా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఏదైనా నేరానికి సంబంధించి బాధిత వ్యక్తి పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వలేనప్పుడు ఈ న్యాయసహాయ కేంద్రం ద్వారా తగిన సహాయం పొందవచ్చని న్యాయమూర్తి ఉదహరించారు. సత్తుపల్లి అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి మహ్మద్‌ అబ్దుల్‌ జావీద్‌ పాషా, సత్తుపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జిలు కే.యువరాజా, శ్రావణ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సహాయ కేంద్రాల ద్వారా సత్వర న్యాయం
సహాయ కేంద్రాల ద్వారా సత్వర న్యాయం
సహాయ కేంద్రాల ద్వారా సత్వర న్యాయం

ట్రెండింగ్‌

Advertisement