e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home జిల్లాలు అన్నదాతలకు భరోసా ‘రైతుబంధు’

అన్నదాతలకు భరోసా ‘రైతుబంధు’

అన్నదాతలకు భరోసా ‘రైతుబంధు’

వైరా, జూన్‌15: అన్నదాతలకు రైతుంబంధు కొండంత అండ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి వైరాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.2.28 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిధులను కేటాయిస్తుందన్నారు. రైతులు భరోసాతో సాగు చేపట్టేందుకు రైతుబంధు అందజేస్తుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగా వైరా అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. మున్సిపాలిటీలో వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌, డంపింగ్‌యార్డ్‌, వైకుంఠధామం నిర్మాణాలకు అధికారులు స్థలాలు కేటాయించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ.. వైరా మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.22 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మున్పిల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, కమిషనర్‌ ఎన్‌.వెంకటస్వామి, వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ లాల్‌మహ్మద్‌, ఎంపీడీవో ఎన్‌.వెంకటపతిరాజు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నదాతలకు భరోసా ‘రైతుబంధు’
అన్నదాతలకు భరోసా ‘రైతుబంధు’
అన్నదాతలకు భరోసా ‘రైతుబంధు’

ట్రెండింగ్‌

Advertisement