e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు ఘనంగా బసవేశ్వరుని జయంతి

ఘనంగా బసవేశ్వరుని జయంతి

ఘనంగా బసవేశ్వరుని జయంతి
ఘనంగా బసవేశ్వరుని జయంతి

బజార్‌హత్నూర్‌, మే 14: బోస్రా గ్రామంలో వీరశైవ లింగాయత్‌ సంఘం సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం బసవేశ్వరుని జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి జెండావిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గజానంద్‌ మాట్లాడుతూ జగత్‌ కల్యాణం కోసం పటుబడిన వ్యక్తి బసవేశ్వరుడు అని కుల, మత, వర్గ, లింగ వివక్ష లేని సమాజం కోసం కృషి చేసి ఎన్నో బోధనలు చేసి దానిని ఆచరించి చూపిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్‌ పెద్దలు పాండురంగ్‌, రామ్‌, శివలింగ్‌, నగేశ్‌, బాలాజీ, అరవింద్‌, కిశోర్‌, సురేశ్‌ పాల్గొన్నారు.
బోథ్‌, మే 14: మర్లపెల్లిలో వీరశైవ లింగాయత్‌ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కమలాకర్‌, వీడీసీ చైర్మన్‌ భాస్కర్‌, యూత్‌ అధ్యక్షుడు లాడేవార్‌ నిఖిల్‌ కుమార్‌, రవీందర్‌, సాయినాథ్‌ పాల్గొన్నారు.
భీంపూర్‌, మే 14: పిప్పల్‌కోటి గ్రామంలో వీరశైవ లింగాయత్‌ నాయకులు బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. వీరశైవ లింగాయత్‌ నాయకులు వీరాకుమార్‌, సంతోష్‌, ఉద్దవ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఘనంగా బసవేశ్వరుని జయంతి

ట్రెండింగ్‌

Advertisement