e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్‌
లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మెట్‌పల్లి/మెట్‌పల్లి టౌన్‌, జూన్‌ 8: ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మెట్‌పల్లి పట్టణంతోపాటు ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, మల్లాపూర్‌ మండలాల్లో 113 మంది లబ్ధిదారులకు 34.38లక్షల విలువైన సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కార్పొరేట్‌ దవాఖానాల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నదని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాణవేని సుజాత, వైస్‌ చైర్మన్‌ బోయినిపెల్లి చంద్రశేఖర్‌రావు, వైద్యుడు రాణవేని సత్యనారాయ ణ, ఎంపీపీలు మారు సాయిరెడ్డి, కాటిపెల్లి సరోజ, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ పూదరి సుధాకర్‌గౌడ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ తీగల లింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మల్లాపూర్‌ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్‌, నేతలు మార్గం గంగాధర్‌, నవాబ్‌, జగన్‌రావు, రాజు, నర్సయ్య, రాజారాం, జీవన్‌రెడ్డి, రవికుమార్‌ పాల్గొన్నారు.
పేదల వైద్యానికి భరోసా
మల్యాల, జూన్‌ 8: సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రాష్ట్ర ప్రభు త్వం నిరుపేదల వైద్యానికి భరోసానిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 29మంది లబ్ధిదారులకు ఆయన 5.85లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసి మాట్లాడా రు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యం నిరుపేదలకు భారం కాకూడదనే భావనతో సంక్షేమ పథకాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ జనగం శ్రీనివాస్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు రాంలింగారెడ్డి, సాగర్‌రావు, బోయినిపల్లి మధుసూదన్‌రావు, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు గడికొప్పుల రమేశ్‌, కట్కూరి తిరుపతి, గొడుగు కుమారస్వామి, రాసమల్ల హరీశ్‌, సుంకె లచ్చయ్య, కోటేశ్వర్‌రావు, ఆసం శివకుమార్‌, వంశీధర్‌, రవివర్మ, ఎడిపల్లి అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

ట్రెండింగ్‌

Advertisement