తిరుమల : తిరుమల ( Tirumala ) లో వేంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ ట్రస్టులకు విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. హైదరాబాద్కు చెందిన నవ్య మార్కెటింగ్ సంస్థ గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది.
గుంటూరుకు చెందిన వెంకట కృష్ణ చైతన్య వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న 71,029 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా 31,184 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.07 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని వివరించారు.