తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 3న పౌర్ణమి గరుడసేవ ( Garuda Seva) ను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా గరుడసేవ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
టీటీడీకి విరాళాలు..
టీటీడీ ( TTD Trusts ) ఆధ్వర్యంలోని ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్( SV Pranadana Trust ) కు రూ.10 లక్షలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు చొప్పున విరాళం శుక్రవారం అందింది. హైదరాబాద్ కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో వంగల హర్షవర్ధన్ రూ.10లక్షలు వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ నేలబొట్ల శుభ సౌజన్య రూ. 10 లక్షలు బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీం కు డీడీలను అందజేశారు.
ఈ మేరకు రూ. 20 లక్షల డీడీలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు శుక్రవారం ఆ సంస్థల ప్రతినిధుల తరుపున తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తితో టీటీడీ ట్రస్టులకు భక్తులు విరాళాలు అందించడం పట్ల ఛైర్మన్ బీ ఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.