గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Jul 03, 2020 , 09:33:56

శ్రీవారి హుండీ ఆదాయం రూ.69లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.69లక్షలు

తిరుమల: తిరుమలలో హుండీ కానుకల ద్వారా రూ.69 లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం 12,013 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, ప్రత్యేక దర్శనం కింద ఆన్‌లైన్‌లో 9000 వేల టిక్కెట్లను జారీ చేస్తున్నామని  పేర్కొన్నారు. ప్రతిరోజు 3వేల మంది భక్తులకు ఉచిత సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నామని అన్నారు.

కరోనా వైరస్‌ అనుమానం ఉంటే హెల్ప్‌లైన్‌ 0877-2256766 అనే నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్‌11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. 


logo