ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Devotional - Sep 12, 2020 , 18:33:15

సర్వ దర్శనానికే ప్రాధాన్యం : టీటీడీ

సర్వ దర్శనానికే ప్రాధాన్యం : టీటీడీ

తిరుమల : సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. తిరుపతిలో కొవిడ్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చి, పరిస్థితులు మెరుగుపడ్డాక సర్వదర్శనం టికెన్ల జారీని పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా రోజుకు మూడువేల సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వడానికి చేర్పాటు చేశామని, తిరుపతిలో కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున మొదటిసారిగా టోకెన్ల జారీ నిలిపివేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం పెటారసి మాసం రద్దీ దృష్ట్యా.. టికెట్ల జారీని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పింది. తిరుపతిలో 3వేల  సర్వదర్శనం టికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. తమిళనాడు నుంచి 10 నుంచి 12వేల మంది భక్తులు క్యూలైన్ల వద్దకు వచ్చే అవకాశం ఉందని, దీంతో మహమ్మారి మరింత విస్తరించే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతోనే టోకెన్ల జారీని నిలిపివేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. సర్వదర్శనం టోకెన్లకు బదులుగా ప్రత్యేక దర్శనం కోటా పెంచినట్లు పేర్కొంది. అంతేగానీ.. సామాన్య భక్తులపై టీటీడీకి ఎలాంటి ఇతర ఆలోచన లేదని స్పష్టం చేసింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo