Dasara Celebrations: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు (Dasara Celebrations) సిద్ధమైంది. సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు తిధుల ప్రకారం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏడాది పది అవతారలలో దర్శనం ఇచ్చిన అమ్మ వారు ఈసారి 11వ ప్రత్యేక అవతారం కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా రూ.500 టికెట్లను రద్దు చేశారు. రూ.300, రూ.100 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు.
సాధారణ భక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తామని, వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కేటాయిస్తామని వెల్లడించారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మ వారి భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని చెప్పారు. క్లూ లైన్లో నీళ్ల బాటిళ్లు, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తామన్నారు.