నీవు
ఆత్మజ్ఞానంలోకి రావాలి
నీవు
చీకటి వెలుగుల సాలెగూడులో
పడి గిలగిల కొట్టుకుంటున్నావు
చీకటిని చీల్చలేవు
వెలుగులోకి రాలేవు
నీవొక రెక్కలు విరిగిన పక్షివి
నీవొక దివాంధ జ్ఞానలోకంలో
డేరావేసుకుని కూర్చున్నావు
కర్మ వికర్మల విధి వంచితుడవు…
దుఃఖం భయం సదనంలో
బందీవై పడి ఉన్నావు
నీ కథ కంచికి చేరదు
మంచానికి పరిమితమై
వీపున పుండ్లు పడి
దురదకు చేతులందక
అచేతనం లోకి వెళ్లిపోతావు…
నీవు ఎదిగే క్రమం
అతేంద్రియ శక్తుల
వలలో నెట్టబడి
జీవితం చిత్తడైయింది
అందుకే అందుకో
వాస్తవాల నిచ్చెన
చేరుకో గలవు
ఆశలదరి