గురువారం 28 మే 2020
Devotional - Apr 28, 2020 , 22:02:02

వైభవంగా భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం

వైభవంగా భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం

వరంగల్‌ : వరంగల్‌ భద్రకాళీ దేవాలయంలో వైశాఖ శుద్ధ పంచమి మంగళవారం భద్రకాళీ, భద్రేశ్వరుల కల్యాణం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం అమ్మవారిని సింహవాహనంపై, సాయంకాలం గజవాహనంపై ఊరేగించారు. వరంగల్‌ మట్వాడ సీఐ గణేశ్‌ దంపతుల సౌజన్యంతో బ్రహ్మోత్సవాలు నిర్వహించగా, వరంగల్‌ అర్బన్‌ డీఎంహెచ్‌వో పోతాని లలితాదేవి, రాజేంద్రప్రసాద్‌ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ సిబ్బంది సామాజిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించాలని డీఎంహెచ్‌వో సూచించారు. 

ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ భక్తులకు ఆలయ ప్రవేశం లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీత పేర్కొన్నారు. కాగా, భారతీయ సనాతన సంస్కృతిని పరిరక్షిస్తూ.. దేశనలుమూలలా ప్రచారం చేసిన ఆదిశంకరుల జయంతిని భద్రకాళీ దేవాలయంలోని ఆదిశంకరుల మందిరంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశంకరుడికి భద్రకాళీ ఆలయ ప్రధానార్చకులు శేషు ప్రత్యేక పూజలు చేశారు.logo