యాదాద్రిలో ప్రారంభమైన ఆర్జిత సేవలు
ఆర్జిత సేవలు | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ ఆర్జిత సేవలను

యాదాద్రి: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు. అయితే దేవస్థానంలో కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ ఆర్జిత సేవలను ప్రారంభించారు. ఇందులో భాగంగా నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, అభిషేకం, అర్చనలు, అష్టోత్తరం, అలంకారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా, భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని ఆలయం ఈవో గీత వెల్లడించారు. ఆర్జితసేవలతోపాటు నిత్యాన్నప్రసాద సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. యాదాద్రి అనుబంధ ఆలయాల్లో కూడా మొక్కు పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవల్లో పాల్గొనేలా, కల్యాణ మండపం హల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆలయంలో సుమారు 78 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో గత నెల 28 నుంచి ఆర్జిత సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
థియరీ తర్వాత ప్రాక్టికల్స్
పసి పెద్దలకు మాత్రమే!
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

