Bathukamma | దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా స్థిరపడింది.
ఐదురోజుల పాటు బతుకమ్మ సంబురాలు మిన్నంటిన తరుణంలో.. ఆరో రోజు అలిగిన బతుకమ్మ పేరు మీద వేడుకలు నిర్వహించరు. మళ్లీ ఏడోనాడు నుంచి అంగరంగ వైభవంగా బతుకమ్మ కొనసాగుతుంది. దుష్ట సంహారం కోసం నడుం బిగించిన అమ్మవారికి మేమంతా తోడుగా ఉన్నామని మహిళలు అందరూ ఆటపాటలతో, చప్పట్లతో తోడుగా నిలుస్తారు. ఉత్సాహపరుస్తారు.