తిరుమల : ఏడు కొండల వేంకటేశ్వరస్వామికి భక్తులు విరివిగా విరాళాలను ( Donations) అందజేస్తున్నారు. చెన్నైకు చెందిన గోపాల కృష్ణ, పురుషోత్తం అనే భక్తులు బుధవారం స్వామివారికి సుమారు నాలుగున్నర కేజీల బరువు గల వెండి నక్షత్ర హారతుల ( Nakshatra Haratis )ను విరాళంగా అందించారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో డిప్యూటీ ఈవో లోకనాథంకు నక్షత్ర హారతులను ( Gold Medals ) అందజేశారు. అదేవిధంగా మైసూరుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు రూ.1.10కోట్లు విలువైన ఐదు బంగారు పతకాలను విరాళంగా అందించారు.