చింతకాని: మండల పరిధిలో రామకృష్ణాపురం రైల్వేగేటు సమీపంలో పెరుమాళ్ళపల్లి విక్రాంత్(31) అనే యువకుడు గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడు విక్రాంత్ విజయవాడ నుంచి ఖమ్మం వైపు వెళ్ళే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనా స్థలంలో ద్విచక్రవాహనం ఉన్నదని రైల్వే ఎస్సై భూక్యా రవికుమార్ తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రైల్వే ఎస్సై భూక్యా రవికుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.