భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
హైదరాబాద్ : భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఏడేండ్ల క్రితం శ్రీనాథ్ అనే వ్యక్తిని సీహెచ్ నాగలక్ష్మి(30) వివాహం చేసుకుంది. వీరికి ఐదేండ్ల వయసున్న బాలుడు ఉన్నాడు. అయితే శ్రీనాథ్, నాగలక్ష్మి పెళ్లైన తర్వాత.. ఆరు నెలలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో భర్తతో పాటు అత్తమామలు కూడా ఆమెను వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులను భరించలేని నాగలక్ష్మి శనివారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

