గురువారం 04 మార్చి 2021
Crime - Jan 20, 2021 , 17:52:40

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రాజన్న సిరిసిల్ల : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో చోటు చేసుకుంది. బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన అల్లె లక్ష్మి ( 45) అనే మహిళను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. లక్ష్మికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బతుకుదెరువు కోసం ఆమె భర్త గల్ఫ్ కు వెళ్లాడు. లక్ష్మి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని సిరిసిల్ల సీఐ బన్సీలాల్, ఎస్‌ఐ వెంకట నర్సయ్య సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హ‌ర్భ‌జ‌న్‌ను వ‌దులుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి? 

VIDEOS

logo