సోమవారం 18 జనవరి 2021
Crime - Jan 10, 2021 , 16:21:45

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మేడ్చల్‌ రంగారెడ్డి : కీసర ఔటర్‌రింగ్‌ రోడ్‌పై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం కీసర టోల్‌గేట్‌ దగ్గరలో యాద్గార్‌పల్లి నుంచి కీసరకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తల పగిలి అక్కడికక్కడే పడి మృతి చెందింది. ఆమె వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ మార్గం గుండా వెళ్తున్న వారు కీసర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన మహిళను గుర్తు తెలియని శవంగా కేసు నమో చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.