కోల్‌కతా : మహిళా క్యాబ్ డ్రైవర్‌ను (Woman Cab Driver) లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రయాణీకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మంగళవారం రాత్రి కోల్‌కతాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సౌరవ్ సిన్హా కోల్‌కతా ఎయిర్పోర్ట్ నుంచి గరియహాత్ రోడ్‌కు ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు.
బుకింగ్‌ను రిసీవ్ చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్ మహిళా డ్రైవర్ సిన్హాను ఎయిర్పోర్ట్ అరైవల్ గేట్ వద్ద పికప్ చేసుకుంది. క్యాబ్‌లో ఎక్కిన సౌరవ్ సిన్హా మహిళా డ్రైవర్ పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. నిందితుడు తన శరీర భాగాలను తాకుతూ వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించింది.
క్యాబ్ దిగిన తర్వాత కూడా తన మొబైల్ ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపుతూనే ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని బుధవారం అలిపూర్ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.
Read More :
Ashok Selvan | సహ నటిని పెళ్లి చేసుకున్న తమిళ హీరో.. ఫోటోలు వైరల్..!