Ashok Selvan | సహ నటిని పెళ్లి చేసుకున్న తమిళ హీరో.. ఫోటోలు వైరల్..!
Ashok Selvan | తమిళ హీరో అశోక్ సెల్వన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. నటి కీర్తి పాండియన్‌ను ఘనంగా వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని తిరుణవేలిలో ఈ వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
Ashok Selvan | తమిళ హీరో అశోక్ సెల్వన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. నటి కీర్తి పాండియన్‌ను ఘనంగా వివాహం చేసుకున్నాడు. తమిళనాడులోని తిరుణవేలిలో ఈ వివాహా వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. తాజాగా వీరి పెళ్లి ఫోటోలను అశోక్ సోషల్ మీడియా మాధ్యమాలలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమున్న నటుడే. పలు డబ్బింగ్ సినిమాలతో పాటు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో హీరోగా నటించాడు. దీనితో పాటుగా విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో గెస్ట్ రోల్లోనూ మెరిసాడు. ఇటీవలే ఓటీటీలో మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన ‘పోర్ తొలిల్’ సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.
కాగా అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ కలిసి ‘బ్లూ స్టార్’ అనే సినిమా చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఇదే సినిమా షూటింగ్లో వీరద్దరూ ప్రేమలో పడినట్లు చెన్నై టాక్. ఇక కీర్తి పాండియన్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు అరుణ్ పాండియన్ కుమార్తె.
“செம்புலப் பெயல் நீர் போல
அன்புடை நெஞ்சம் தாம் கலந்தனவே.”#Grateful#AshoKee🔥 @iKeerthiPandian pic.twitter.com/TyQwuO7oGK— Ashok Selvan (@AshokSelvan) September 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

