బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 17, 2020 , 21:21:50

ఆగివున్న లారీని ఢీకొన్న బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

ఆగివున్న లారీని ఢీకొన్న బైక్‌.. ఇద్దరు యువకులు మృతి

వికారాబాద్‌ : జిల్లాలోని పెద్దేముల్‌ మండల పరిధిలోని ఇందూరు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని బైక్‌ ఢీకొన్న దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.  

అదేవిధంగా మరొక ఘటనలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపారావుపేట గ్రామ శివారులో ధర్మారం-పెద్దపల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బొట్లవనపర్తి గ్రామానికి చెందిన సిరికొండ అనిల్‌(30) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నంది మేడారం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ముందు ఉన్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడి కుడికాలు తెగి కిందపడింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ శ్రీనివాస్‌ బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.


logo