గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jun 30, 2020 , 16:10:44

విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

విద్యుదాఘాతంతో అన్నదమ్ముల మృతి

 అనంతపురం: జిల్లాలోని ఉరవకొండ మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. ఉరవకొండ గ్రామం బాలాజీ సినిమా థియేటర్‌ వద్ద ఉండే మల్లేశ్‌, రమేశ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు బహిర్భూమికి వెళ్లారు. నీటి ట్యాంకు వద్ద విద్యుత్‌ ప్రవాహంతో ఉన్నఇనుప కంచెను గమనించక తాకడంతో అన్నదమ్ములు  విద్యుదాఘాతానికి గురయ్యారు.

దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి  చెందారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింప చేశారు. ప్రమాద విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని  విద్యుత్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ మురళీకృష్ణ తెలిపారు. 


logo