శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 10:37:04

సరస్సులో గల్లంతై ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

సరస్సులో గల్లంతై ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి

రామ్‌ఘర్‌ : జార్ఖండ్‌ రామ్‌ఘర్‌ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. శిక్షణ పొందుతున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు సరస్సులో పడి మృతి చెందారు. రామ్‌ఘర్‌ జిల్లా సిక్కు రెజిమెంటల్ సెంటర్ (ఎస్‌ఆర్‌సీ) పరిధిలోని ఇనా సరస్సులో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లలో ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారు. వీరిని పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించామని రామ్‌ఘర్‌ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ తెలిపారు. జవాన్ల మృతదేహాలను బుధవారం రాత్రి సరస్సు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సివిల్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను వారు తిరిగి ఆర్మీకి అప్పగించారు. ఘటనపై రామ్‌ఘర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo