సోమవారం 25 జనవరి 2021
Crime - Jan 04, 2021 , 15:20:38

ట్రాలీ ఆటో బోల్తా.. 18 మందికి గాయాలు

ట్రాలీ ఆటో బోల్తా..  18 మందికి గాయాలు

సిద్దిపేట : ట్రాలీ ఆటో బోల్తాపడి 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం అంగడి కిష్టాపురం శివారులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను పౌరసరఫరాశాఖ గోదాములో పనిచేస్తున్న బీహార్‌ రాష్ట్రానికి చెందిన హమాలీలుగా పోలీసులు గుర్తించారు. వీరిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అక్కారం నుంచి అంగడి కిష్టాపురం శివారులోని గోదాంలో హమాలీలు పనిచేసేందుకు వెళ్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo