విషాదం : నీటి సంపులో పడి బాలుడు మృతి
నీటి సంపు | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం ఆములూర్ గ్రామంలో గురువారం నీటి సంపులో పడి బాలుడు మృతిచెందాడు.

నల్లగొండ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం ఆములూర్ గ్రామంలో గురువారం నీటి సంపులో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల కరుణాకర్, శిరీష దంపతుల రెండో సంతానం రిషికుమార్ (16 నెలలు) గురువారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న మూత లేని నీటి సంపులో పడిపోయాడు.
గమనించని తల్లిదండ్రులు కొంత సేపటికి చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. చివరకు నీటి సంపులో చూడగా శవమై తెలియాడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ.10వేల సాయమందించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్‌రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్‌సెంచరీ చేసిన స్టార్ ఆల్‌రౌండర్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

