శామీర్ పేట్, జూన్ 24 : పెట్రోల్ బంకులో ఇద్దరు అంగతకులు కత్తులతో వీరంగం చేశారు. వాళ్లలో ఒకరు పరారి కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి అలియాబాద్ మునిసిపల్ పరిధిలోని మజీద్ పూర్ (Majid Pur) ఇండియం ఆయిల్ పెట్రోల్ (Indian Oil) బంకులో పెట్రోల్ పోసుకునేదుకు ముగ్గురు ద్విచక్ర వాహనం వచ్చారు. సిబ్బందిని డబ్బులు తీసివ్వాలని డిమాండ్ చేసిన ఆగంతుకులు కత్తులతో వీరంగం చేశారు.
వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వాళ్లను చూసి.. ఇద్దరు పరారి అయ్యారు. మత్తులో ఉన్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంగం చేసినవారు స్థానికంగా కబేలాలో పనిచేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఎవరు? వారికి నేర చరిత్ర ఉందా.. వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.