అసోంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల కిడ్నాప్
ఓఎన్జీసీ| అసోంలో ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోని శివ్‌సాగర్ జిల్లాలోని లాక్వా క్షేత్రం నుంచి సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు ఉద్యోగులను కిడ్నాప్ చేశారని ఓఎన్జీసీ ప్రకటించింది.

దిస్పూర్: అసోంలో ఓఎన్జీసీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోని శివ్‌సాగర్ జిల్లాలోని లాక్వా క్షేత్రం నుంచి సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు ఉద్యోగులను కిడ్నాప్ చేశారని ఓఎన్జీసీ ప్రకటించింది. వారిలో ఇద్దరు జూనియర్ ఇంజినీర్లు, ఒక జూనియర్ టెక్నీషియన్ ఉన్నారని, వారు ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నారని వెల్లడించింది. దుండగులు వారిని కంపెనీకి చెందిన ఆపరేషనల్ వాహనంలో తీసుకెళ్లారని తెలిపింది. దానిని అసోం-నాగాలాండ్ సరిహద్దుల్లోని నిమోనగఢ్ అటవీ ప్రాంతంలో వదిలివెళ్లారని పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రకటించింది. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్థిక కష్టాలు.. అటుపై కరోనా పాజిటివ్.. కూలీ బలవన్మరణం
అరెస్ట్ భయంతో బాత్రూమ్ కిటికీలోంచి దూకిన క్రిమినల్..
తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు
వికాశ్ దూబే ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు క్లీన్ చిట్
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం : ప్రియాంక గాంధీ
కరోనా మరణాలను దాస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం?
ప్రాణం కంటే డబ్బే ఎక్కువనా?
‘అన్నపూర్ణ’ను అధిరోహించిన తొలి భారతీయురాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

