సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా అలియాస్ సురేష్, నారాయణ సాహూ, బిజియకుమార్ సాహు అలియాస్ బిజంలను సత్తుపల్లి కోర్టులో రిమాండ్ చేయగా మరో వ్యక్తి అనారోగ్యంతో ఉండటంతో రిమాండ్కు తరలించలేదని పోలీసులు వెల్లడించారు.