అమరావతి : చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు అయ్యప్ప స్వామి భక్తులు చెరువులో స్నానానికి దిగారు. ఈ క్రమంలో చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో..లోతు తెలియక ముగ్గురు అయ్యప్ప భక్తులు ఒకరితర్వాత ఒకరు మునిగి చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.