శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 27, 2021 , 20:24:06

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

వికారాబాద్‌ : భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జిల్లాలోని కరణ్‌కోట పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన కథనం ప్రకారం..కర్నాటక రాష్ట్రం, బీదర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ (36) తాండూరు మండలం చెంగోల్‌ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం మండలంలోని గౌతాపూర్‌లోని చెల్లెలు రేణుక ఇంటికి వచ్చాడు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్నారు. కాగా, మృతుడి భార్య మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని వివరించారు. భార్య ఇంటికి రాకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరాలను వెల్లడించారు. మృతుడి చెల్లెలు రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VIDEOS

logo