ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పిడుగు పడి ఒకరి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర ప్రాంతంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కూలీ నిమిత్తం బరంపూర్ గ్రామానికి వచ్చారు.
ఎప్పటిలాగా వ్యవసాయ పనులకు వెళ్లగా సాయంత్రం పిడుగు పడటంతో సంగీత (38) అక్కడికక్కడే మృతి చెందగా..కౌసల్య, సుజాత, అర్జున్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు అంబులెన్స్ లో తరలించారు.గాయాలైన ముగ్గురు కూడా మహారాష్ట్ర ప్రాంత వాసులు.
ఇవి కూడా చదవండి..
China Education : ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి హరీశ్‌రావు
Twin Towers: 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చేయండి : సుప్రీంకోర్టు