ఇద్దరు కొడుకులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రి సెల్ఫీ వీడియో!

నాగర్‌కర్నూల్ : చిన్నపాటి సమస్యకే కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. ప్రేమ వైఫల్యం.. ఒంటరితనం.. నిరుద్యోగం.. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. కారణాలేవైనా నిత్యం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు.. ప్రాణాలు వదులుతున్నారు. జీవితాన్ని జయించలేక చావును చేరుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ తమ కుటుంబాలను విషాదంలోకి నెడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించాడు. సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. పోలీసులు తండ్రి సహా ఇద్దరు చిన్నారులను ఆంధ్రప్రదేశ్‌లో ఆచూకీ గుర్తించి, కాపాడారు.
వివరాల్లోకి వెళితే.. అంకిరోనిపల్లెకు చెందిన హరిశంకర్ తన ఇద్దరు కొడుకులతో కలిసి శనివారం ఇంటి నుంచి వెళ్లాడు. ఆమ్రాబాద్ మండలం మన్ననూర్ దుర్వాసుల చెరువు సమీపంలోని చెక్ పోస్ట్ పరిధి ఒకటో సిట్టింగ్ పాయింట్ వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు పిల్లలతో సహా హరిశంకర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దోడ్నాల వద్ద గుర్తించారు. కాగా, ఆత్మహత్య యత్నానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!
- ప్రభాస్‌తో ఢీ అనేందుకు సిద్ధమైన తమిళ హీరో
- కబడ్డీ.. కబడ్డీ.. అదరగొట్టెన్ అదనపు కలెక్టర్
- కాలినడకన తిరుమల కొండెక్కిన జబర్దస్త్ నటుడు