మెదక్ : అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కూల్‌డ్రింక్స్ వ్యాపారం మాటున ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి చౌరస్తా సమీపంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన చెరకుపల్లి నవీన్‌కుమార్ ఆటో (టీఎస్ 35టి 9710)లో కూల్‌డ్రింక్స్ వ్యాపారం పేరుతో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నాడు.
పక్కా సమాచారం జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ మురళీకుమార్ నేతృత్వంలో ఆటోను తనిఖీ చేసి గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు.
వీటి విలువ సుమారుగా రూ.1,89,610 ఉంటుందన్నారు. నిందితుడు చెరకుపల్లి నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
పేరు కోసమే విదేశాలకు కరోనా మెడిసిన్.. ప్రధాని మోదీపై మమత ఫైర్