రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్( ORR ) సర్వీస్ రోడ్ వద్ద బండ్లగూడ జాగీర్ సమీపంలో రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది . ఇద్దరు యువకులు మోటార్‌సైకిల్‌పై వెళ్తు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ సోహెద్ (20), షేక్ సాహిల్ (17) మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వీరు ఎలక్ట్రిషియన్లుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.