ముంబై : బుధవారం ముంబై శివాజీ పార్క్ వద్ద నిరసనల్లో ఒక సామాన్య మహిళ చూపిన ధైర్యం, ధిక్కార స్వరం దేశం యావత్తు చూసింది. అక్కడ విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తుండగా..ఆ వ్యాన్ ముందుకు వెళ్లకుండా ఆమె అడ్డుకున్న తీరు సంచలనంగా మారింది.
‘మీ హక్కుల గురించి కచ్చితంగా తెలిసి వుండాలి’ అంటూ సామాన్య మహిళ రియా అహిర్ చేసిన నినాదానికి పోలీసులు దిగిరాక తప్పలేదు. వ్యాన్లో ఉన్న విద్యార్థులు, ఇతర నిరసనకారులను విడుదల చేయాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలని రియా డిమాండ్ చేశారు.