పగ్వారా: పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(LPU)లో ఆదివారం భీకర వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హింసాత్మక ఘటనల తర్వాత సోమవారం ఆ వర్సిటీలో పరిస్థితి శాంతించింది. 10 రోజులు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు స్వంత ఊళ్లకు వెళ్తున్నారు. విధ్వంసానికి పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని పంజాబ్ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రహదారి-44పై 15 గంటలుగా స్తంభించిన ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ప్రస్తుతం యూనివర్సిటీలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జలంధర్-పగ్వారా హైవే .. విద్యార్థులు, వారి తల్లితండ్రులతో నిండిపోయింది.
క్యాంపస్‌లో జరిగిన హింస వల్ల చాలా వరకు ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది. బయటివాళ్ల వల్లే ఆ నష్టం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాల్లో విద్యార్థిని ఓ బయటి వ్యక్తి మహిళా రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం లవ్లీ వర్సిటీ విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. ప్రాపర్టీని డ్యామేజ్ చేసి, సమీప హైవేను బ్లాక్ చేశారు. ఆదివారం సాయంత్రం పోలీసులపై రాళ్లు రువ్వి, వాళ్ల వాహనాలకు నిప్పుపెట్టారు.