జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏవీఎం స్కూల్ విద్యార్థులు
నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు పది మంది ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కందాల పాపిరెడ్డి, ప్రిన్సిపాల్ కందాల స్వప్న శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వీరు...
నకిరేకల్, సెప్టెంబర్ 28 : నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు పది మంది ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కందాల పాపిరెడ్డి, ప్రిన్సిపాల్ కందాల స్వప్న శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వీరు ఈ నెల 30వ తారీకు దేవరకొండలో జరిగే జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. అండర్ 14 బాలుర విభాగంలో డి.అరవింద్ నాయక్, ఆర్.అంజి బాబు, ఎం.శేఖర్, జి.అఖిల్.. అండర్ 14 బాలికల విభాగంలో శ్రీరాముల తేజశ్రీ, కె.అక్షిత, ఎన్.వైశాలి, ఎం.జాహ్నవి, ఏ.వెన్నెల.. అండర్ 17 బాలుర విభాగంలో యానాల రితిక్ రెడ్డి ఎంపికైనట్లు తెలిపారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నిమ్మల శంకర్ గౌడ్, పూజిత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

