హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న అందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం(హెచ్1 ఐఎన్టీయూసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, కారద్యర్శి ఎన్ సందీప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. నిరుడు జూలైలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 1195 విడుదల చేసిందని, అయితే ఆ జీవోను అమలు చేయకుండా శ్రమ దోపిడీ చేస్తున్నదని మండిపడ్డారు.