న్యూఢిల్లీ, జూలై 23: ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న జంతర్ మంతర్ వేదికను ఖాళీ చేయాలంటూ కేంద్రం గురువారం హుకుం జారీ చేసినట్టు తెలిసింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్ మంతర్ కేంద్రంగా జరుగుతున్న ఆందోళన కేంద్రంలో అలజడి సృష్టిస్తున్నది. నిన్నమొన్నటి వరకు వీరి ఆందోళనను మోదీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నప్పటికీ సోమవారం వీరు నిర్వహించిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం, ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు దేశ, ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. దీంతో విద్యార్థులను ఎలాగైనా ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించడానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఒక వేళ వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయకపోతే పోలీస్ చర్య ద్వారా అయినా వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.