PM Modi | నీట్ పేపర్ లీకేజ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం.. అర్ధరాత్రి వేళ ప్రధాని మోదీ ప్రకటన
PM Modi | దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ పేపర్ లీకేజ్‌పై ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు.
PM Modi | నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నాం. పేపర్ లీకేజ్ ఘటనపై రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం. నిందితులను పట్టుకున్నాం. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాం.
– గురువారం అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూలై 23 : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీట్ పేపర్ లీకేజ్‌పై ప్రధాని మోదీ ఎట్టకేలకు స్పందించారు. నీట్ పేపర్ లీక్‌పై కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా. శుక్రవారం కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నాం. పేపర్ లీకేజ్ ఘటనపై గత రెండున్నర నెలల్లో అనేక సమర్థవంతమైన చర్యలు తీసుకున్నాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాలని సంబంధిత శాఖలను ఆదేశించా’ అని చెప్పారు. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితులను పట్టుకున్నామని, విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలన్న ప్రభుత్వ బాధ్యతను తాము నెరవేర్చామని చెప్పారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
దీనికంటే ముందు పరీక్ష లీకేజీ కేసుల్లో సకాలంలో విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల చట్టం (అక్రమ పద్ధతుల నివారణ) పరిధిలోకి వచ్చే నేరాలు, సంబం ధిత కేసులను ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారిస్తుందని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

