చింతకాని: మద్యం మత్తులో డీసీఎం వ్యాన్ ను నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపుచేలేక రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండల పరిధిలో నాగులవంచ గ్రామసమీపంలో మంగళవారం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అమలాపురంకు చెందిన మురగాని విజయ్‌కుమార్(డ్రైవర్) తనతో పాటు సహయకుడు రాకేశ్ తో కలిసి సరుకు రవాణా చేయడానికి బోనకల్ మీదుగా ఖమ్మం నగరానికి వెళ్తుండగా నాగులవంచ వద్ద డీసీఎం వ్యాను అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా సహయకునికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు పక్కనున్న చెట్టును వ్యాను బలంగా ఢీకొట్టడంతో క్యాబిన్లో ఇరుక్కున్న రాకేశ్‌ను బయటకు తీయడానికి స్ధానికులు శ్రమించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.