మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 18, 2020 , 15:32:13

అక్రమ క్రషర్లను సీజ్ చేసిన అధికారులు

అక్రమ క్రషర్లను సీజ్ చేసిన అధికారులు

సంగారెడ్డి : జిల్లాలోని కొల్లూర్, ఉస్మాన్ నగర్ ప్రాంతంలో అక్రమ క్రషర్లను అధికారులు సీజ్ చేశారు. కొల్లూర్‌లో ఐదు క్రషర్లు, అక్రిడ్ ఇన్ఫ్రా, పుల్లూరి మైనింగ్ అండ్ లాజిస్టిక్, గోల్డ్ డస్ట్ క్రషర్, సాయి బాలాజీ రాక్స్ అండ్ ఇండస్ట్రియల్, హైటెక్ స్టోన్ అండ్ రోబో సాండ్, ఉస్మాన్ నగర్లో హనుమాన్ ఎంటర్‌ప్రైజెస్‌ క్రషర్‌ను సీజ్ చేశారు. ఎవరైనా అనుమతులు లేకుండా క్రషర్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. కార్యక్రమంలో రెవెన్యూ, మైనింగ్, మున్సిపల్, విద్యుత్, పొల్యూషన్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.