ములుగురూరల్ : ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని రంగారావుపల్లి వద్ద ఈ నెల 9న రోడ్డు ప్రమాదానికి గురైన ములుగుకు చెందిన జక్కుల రాజయ్య(50) మృతి చెందాడు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తలకు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానకు తరలించగా రాజయ్య అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన మృతితో గొల్లవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.