ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 16, 2020 , 18:29:15

తనయుడి చేతిలో తల్లి హతం..

తనయుడి చేతిలో తల్లి హతం..

నిజామాబాద్‌ ‌: నవ మాసాలు మోసి కనిపెంచిన కొడుకు చేతిలోనే ఓ తల్లి హత్యకు గురైన విషాద సంఘటన జిల్లాలోని రుద్రూర్‌ మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండలంలోని అంబం గ్రామానికి చెందిన చీలపల్లి సాయవ్వ(65)కు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు మరణించగా.. చిన్న కొడుకు చిన్న సాయిలు ఉన్నాడు. అతడు చెడు వ్యసనాలకు బానిసై భార్య గౌరవ్వను నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకొని చాలా రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. 

అప్పటి నుంచి తాగుడుకు బానిసైన సాయిలు ఇంట్లో తల్లితో పాటు చుట్టుపక్కల వారితో, గ్రామస్తులతో తరచూ గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి తిని ఇంట్లో పడుకున్న సాయవ్వ బుధవారం ఉదయం మరణించి ఉంది. తన తల్లి మరణించిందని సాయిలు చుట్టపక్కల వారికి చెప్పాడు. వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

కొడుకు చిన్నసాయిలుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే తల్లిని గొంతు నులిమి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతురాలి పెద్ద కోడలు అనుషవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవీందర్‌ తెలిపారు. logo