e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News బాయ్ ఫ్రెండ్ తో కంట‌ప‌డిన బాలికపై వేధింపులు ఆపై వీడియో తీసి..

బాయ్ ఫ్రెండ్ తో కంట‌ప‌డిన బాలికపై వేధింపులు ఆపై వీడియో తీసి..

బాయ్ ఫ్రెండ్ తో కంట‌ప‌డిన బాలికపై వేధింపులు ఆపై వీడియో తీసి..

ల‌క్నో : యూపీలో బాలిక‌లు, మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు, వేధింపుల ఘ‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. మొరదాబాద్ జిల్లాలోని భోజ్పూర్ ప్రాంతంలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో బాయ్ ఫ్రెండ్ తో క‌నిపించిన బాలిక‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగికంగా వేధించారు. వారి నీచ‌మైన ప‌నిని నిందితులు వీడియోలో రికార్డు చేశారు. నేరానికి సంబంధించిన వీడియో క్లిప్ లు సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై వైర‌ల్ కావ‌డంతో ఈ దారుణం వెలుగులోకి వ‌చ్చింది.

బాలిక దుస్తులు తొల‌గించేందుకు నిందితులు ప్ర‌య‌త్నిస్తుంటే బాలిక‌, ఆమె బాయ్ ఫ్రెండ్ త‌మ‌ను విడిచిపెట్టాల‌ని వారిని వేడుకోవ‌డం ఈ వీడియోలో క‌నిపించింది. బాధితుల మాట‌లు ప‌ట్టించుకోని నిందితులు వీడియో క్లిప్పుల‌ను వైర‌ల్ చేస్తామ‌ని బెదిరించారు. వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగి భోజ్పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని గ్రామంలో బాలిక‌ను గుర్తించారు.

- Advertisement -

బాలిక తండ్రి ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల‌పై పోక్సో చ‌ట్టం, ఐటీ చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేశారు. నిందితుల‌ను స‌యీద్, అర్ష‌ద్ అలీగా గుర్తించామ‌ని, వీరిని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాయ్ ఫ్రెండ్ తో కంట‌ప‌డిన బాలికపై వేధింపులు ఆపై వీడియో తీసి..
బాయ్ ఫ్రెండ్ తో కంట‌ప‌డిన బాలికపై వేధింపులు ఆపై వీడియో తీసి..
బాయ్ ఫ్రెండ్ తో కంట‌ప‌డిన బాలికపై వేధింపులు ఆపై వీడియో తీసి..

ట్రెండింగ్‌

Advertisement